Jun 22,2023 11:02

చైనా : చైనాలోని ఓ రెస్టారెంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్‌ లీక్‌తో పేలుడు సంభవించడంతో 31 మంది మృతి చెందారు. చైనాలోని యిన్‌చువాన్‌లోని బార్చెక్యూ రెస్తారెంట్‌లో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ లీక్‌ కావడంతో పేలుడు సంభవించినట్టుగా స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సేవలకు చెందిన 100 మందిని, 20 వాహనాలను సంఘటనా స్థలానికి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 31 మంది మరణించగా.. మరో ఏడుగురు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ స్పందిస్తూ గాయపడిన వారికి చికిత్స అందించడంలో అన్ని విధాలుగా కృషి చేయాలని పేర్కొన్నట్టుగా స్టేట్‌ బ్రాడ్‌కాస్టర్‌ సీసీటీవీ పేర్కొంది. ప్రజల జీవితాలు, ఆస్తులను సమర్థవంతంగా రక్షించడానికి కీలకమైన పరిశ్రమలు, రంగాలలో భద్రతా పర్యవేక్షణ, నిర్వహణను బలోపేతం చేయాలని సూచించారని తెలిపింది.