Mar 23,2023 16:03

ప్రజాశక్తి-కలకడ (అన్నమయ్యజిల్లా) : ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేయాలని చైల్డ్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్టు అధికారి, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి ధనలక్ష్మి ఆదేశించారు. గురువారం మండల కేంద్రమైన కలకడ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సిబ్బంది పనిచేసే ఉత్తమ ఫలితాల సాధనకై కష్టపడాలన్నారు. 10వ తరగతి విద్యార్థులను టీవీలకు, సెల్ఫోన్లకు దూరంగా ఉంచి, విద్యపై మక్కువ పెంచుకునేలా చర్యలు చేపట్టేందుకు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి తగు సూచనలు సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడే పాఠశాలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పేరు ప్రతిష్టలు రావడం జరుగుతుందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ మెనూ ప్రకారం భోజనాలు వడ్డిస్తున్నారా లేదా భోజనాలు రుచికరంగా ఉన్నాయా లేదా అని అని విద్యార్థులను అడిగి తెలుసుకన్నారు. విద్యార్థుల ,ఉపాధ్యాయులు హాజరు రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి రవికుమార్‌, ఎంపీడీవో సిహెచ్‌ నారాయణ, ఎంఈఓ మునీంద్ర నాయక్‌, ప్రిన్సిపాల్‌ అనిత, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.