Jun 19,2023 13:02

మయన్మార్‌ : మయన్మార్‌లో సోమవారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1 తీవ్రతతో నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 7.10 గంటల సమయంలో మయన్మార్‌ దక్షిణ తీరానికి సమీపంలో వెడల్పు : 15.41, పొడవు 96.37, 10 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ ట్వీట్‌లో పేర్కొంది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆర్థిక నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని ఎన్‌సిఎస్‌ పేర్కొంది.