Sep 19,2022 07:57

దాహం తీరని కాకి
లోకాన్ని తిట్టింది
తన సంబరమే తప్ప
ఏమీ పట్టని జనసందోహం తీరుని తిట్టింది
మబ్బుల్ని తిట్టింది
చిరుజల్లు పాటి సాయం మరిచి,
ద్రోహం చేస్తూ తీరం దాటిన
మబ్బుల తేరుని తిట్టింది
చివరకు రెక్కలు విప్పింది
సత్తువ మేరా దిక్కులు చుట్టింది
తన రెక్కల కష్టం స్వేదం కాగా
స్వేదం చిందిన నేల ఒయాసిస్సు కాగా
ఎటు చూసినా సరస్సులే
దాహం తీరింది
సందేహం తీరింది!

- డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ,. 94408 36931