Sep 12,2022 06:55

వెళ్ళే దారిలో
వేలాడేసిన మొహాల్లో
ఎడారి ఛాయలుంటాయి
దాగివున్న గాయాలుంటాయి
నవ్వుల పువ్వులు కానరావు
నీటి చెమ్మల జాడలు కరువు
నాకెందుకు లెమ్మని దాటి వెళ్లకు
చేసేదేముందని ముందుకు సాగిపోకు
చేయందించి చెలిమి చెయ్యి
చిర్నవ్వుల్ని సాగు చెయ్యి
బృందావనమై
నీ యాత్ర విరబూస్తుంది!

- డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, 94408 36931