న్యూఢిల్లీ : అనువాద రచనల విభాగంలో 2021వ సంవత్సరపు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సామాజిక ఉద్యమ కారణి కె. సజయకు లభించింది. దేశవ్యాప్తంగా మాన్యువల్ స్కావెంజర్స్ హృదయ విదారక జీవన స్థితి గతులను వివరిస్తూ ప్రముఖ రచయితి భాషాసింగ్ హిందీలో అధృశ్యభారత్ (నాన్ ఫిక్షన్) పుస్తకాన్ని రాశారు. దానిని అశుద్ధ భారత్ పేరుతో తెలుగులో చేసిన చేసిన అనువాదానికి గానూ సజయకు ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.










