అక్టోబర్ 30 ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని టాగూర్ లైబ్రరీలో సోమేపల్లి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం సభ జరగనున్నది. ప్రముఖ సాహితీవేత్త గుమ్మ సాంబశివరావు అధ్యక్షతన జరిగే ఈ సభలో ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ప్రజాశక్తి ఫీచర్స్ ఎడిటర్ సత్యాజీ, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ తిప్పరమల్లి జమల పూర్ణమ్మ, ప్రముఖ రచయిత శ్రీకంఠస్ఫూర్తి, సోమేపల్లి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులందరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
- చలపాక ప్రకాష్,
సంపాదకులు, రమ్యభారతి










