Aug 15,2022 15:28

ప్రజాశక్తి-చందర్లపాడు: మండల కేంద్రమైన చందర్లపాడులోని స్థానిక సుందరయ్య భవన్లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. సిపిఎం నాయకులు ఎస్.కె హస్సాన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆజాకి అమృత్ మహోత్సవ్ అని పిలుపునిచ్చింది. స్వతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేని వ్యక్తులు ఇంటింటికి జాతీయ జెండా ఎగరవేయడం శోచనీయం అన్నారు. భారత రాజ్యాంగంలో ప్రధానమైన ప్రజాస్వామ్యం,లౌకిక రాజ్యం,ఫెడరల్ రాజ్యాంగం, సామాజిక న్యాయం, ఈ నాలుగు అంశాలకు ఈ నాడు పాలిస్తున్న పాలకులు తిలోదకాలు ఇస్తున్నారని, వీటిని కాపాడాలని సిపిఎం, వామపక్షాలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఐక్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ, ధరల పెరుగుదల ప్రజల మీద భారాలు మోపడం కార్మిక చట్టాలు మార్చి కార్మిక హక్కులును కాలరాయడం ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుసరించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె. సీతారావమ్మ,అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.