Aug 19,2022 22:48

ప్రజాశక్తి-అవనిగడ్డ
రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల వారికి అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సంకల్పమని శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ బాబు పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని రెండో వార్డు బీసీ కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా 32 గహాలను ఎమ్మెల్యే సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆ పథకాలు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్‌ బాబు మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కుల మాత పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి తాగునీటి పైపులైను విద్యుత్తు లైను అంతర్గత రహదారుల సమస్యలను ఎమ్మెల్యే దష్టికి తీసుకురాగా ప్రతి సచివాలయానికి విడుదల చేయనున్న రూ 20 లక్షల నిధులతో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతి దేవి, జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ గో రుముచ్చు ఉమా, ఇంచార్జ్‌ ఎంపీడీవో పి శైలజ కుమారి, సీఐ జి శ్రీనివాస్‌, వ్యవసాయ శాఖ ఏవో వి సౌరమ్మ, ఎంపీటీసీ సభ్యులు గోళ్ళ కష్ణకుమారి, తోట గణేష్‌ పలువురు వార్డు సభ్యులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.