వాషింగ్టన్ : అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా జి 20 సదస్సుకు హాజరుకానున్నట్లు ఐఎంఎఫ్ ప్రతినిధి మంగళవారం తెలిపారు. ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 3 వరకు చైనాలో పర్యటించి, సీనియర్ నేతల బృందంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని అన్నారు. న్యూఢిల్లీలో జరగనున్న జి 20 దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతలు సమావేశానికి హాజరయ్యే ముందు జార్జివా ఆగేసియా దేశాల సంఘం (ఎఎస్‌ఇఎఎన్) నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గనేందుకు జకార్తా వెళతారని అన్నారు. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు జకార్తా ఉంటారని, అనంతరం సెప్టెంబర్ 8 నుండి 10 వరకు జి20 సదస్సు నిమిత్తం న్యూఢిల్లీ చేరుకుంటారని వెల్లడించారు.