Aug 13,2022 23:00

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు ఘనంగా అమ్మవారి పవిత్రోత్సవాలు కొనసాగాయి. ఏడాదిలో తెలిసీ తెలియక చేసిన తప్పిదాలకు ప్రాయ శ్చిత్తంగా అమ్మవారి పవిత్రోత్సవాలు నిర్వహించామని ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్‌ తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల పూర్ణాహుతి కార్యక్ర మంలో ఇఓ భ్రమరాంబ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.