Mar 19,2023 17:09

ప్రజాశక్తి-చిన్నమండెం : రాష్ట్రంలో జరిగిన పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ తో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు అని రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన దిగువ గొట్టి వీడు గ్రామంలో పల్లె పల్లె గడపగడప తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అనాగరిక పాలనను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం వెనుక పట్టభద్రుల కృషి ఎంతో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో దొడ్డిదారిన ఎలాగైనా లబ్ది పొందాలని వైసీపీ ప్రభుత్వం దొంగ  ఓట్లు డబ్బు పంపిణీతో గెలవాలని ప్రయత్నించిన విద్యావంతులు మాత్రం తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో ఓట్లు వేసినట్లు ఆయన తెలిపారు.వైసీపీ ప్రభుత్వం పై నిరుద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఫలితాలను చూసినట్లయితే అర్థమయితుందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సరం లక్ష ఉద్యోగాలు ఇస్తామని యువతకు ఆశలు రేపి నిరాశపరిచారు. అన్ని అబద్ధాలే చెబుతూ పోవడంతో ప్రభుత్వం యొక్క చేతకానితనం బయటపడిందన్నారు. ఎన్నికల్లో 36 మంది ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లు ఆరుగురు ఎంపీలు 167 మంది జడ్పిటిసిలు మండల ప్రెసిడెంట్లు అనేక రకాల కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఉన్న పట్టభద్రుల దాటికి వాళ్ళ పరపతి కూడా కాలగర్భంలో కలిసిపోయింది అన్నారు.  ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి  తెచ్చి ఎలాగైనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించాలని ప్రయత్నాలు చేయడం జరిగింది అన్నారు .అయితే పట్టభద్రులు ఎవరిని లెక్కచేయకుండా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం గెలిపించడం అభినందించాల్సిన విషయం అన్నారు. వారికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి రుణపడి ఉంటామని రమేష్ కుమార్ రెడ్డి చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకొని పోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వస్తారని రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బెల్లం నర్సింహారెడ్డి, హరి అమర్నాథరెడ్డి, పొలిమేరపల్లి చెన్న కృష్ణారెడ్డి, అలాగాని రెడ్డప్ప, దేవ గోపాల నాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.