Dec 19,2020 20:56

ఉత్తరప్రదేశ్‌: యోగి సర్కార్‌ తీసుకువచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడి వ్యతిరేక ఆర్డినెన్స్‌ కింద అరెస్టయిన ఇద్దరు సోదరులను విడుదల చేయాలని ఉత్తరప్రదేశ్‌ కోర్టు శనివారం ఆదేశించింది. బలవంతపు మత మార్పిడిందన్న దానిపై పోలీసులు ఆధారాలు సేకరించలేకపోయారని, దీంతో సుమారు రెండు వారాలుగా మొరాదాబాద్‌ జిల్లా జైలులో ఉన్న ఇద్దరు ముస్లిం యువకులను విడుదల చేయాలని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. దీంతో శనివారం వారిద్దరిని జైలు నుంచి విడుదల చేశారు.
మొరాదాబాద్‌లోని కాంత్‌ ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడు, 22 ఏళ్ల హిందూ యువతి జులై 24న వివాహం చేసుకున్నారు. ఐదు నెలల తర్వాత తమ వివాహాన్ని నమోదు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లారు. కాగా బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆ జంటను అడ్డుకున్నారు. తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు ఆ యువతి చెప్పగా ఆమెపై మండిపడ్డారు. మరోవైపు ముస్లిం యువకుడితోపాటు అతడి సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. గర్భవతి అయిన పింకిని ప్రభుత్వ వసతి గఅహానికి తరలించారు. కాగా ఆమెకు అబార్షన్‌ అయ్యేందుకు ఇంజక్షన్‌ ఇచ్చారన్న వదంతులను ప్రభుత్వం ఖండించింది.