Aug 18,2022 22:59

ప్రజాశక్తి- మచిలీపట్నంరూరల్‌
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పంట నమోదును రైతులందరూ తప్పనిసరిగా చేయించుకోవాలని కష్ణా జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్‌రావు తెలిపారు. గురువారం బందర్‌ మండలం పొట్లపాలెం గ్రామంలో పంట నమోదు కార్యక్రమంను పర్యవేక్షణ చేశారు. పంట నమోదు చేయించుకోవడం వలన కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేశారు. ప్రకతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్ట పరిహారం అందించడం, సున్నా వడ్డీ పంట రుణాలను వర్తింపజేయడం, పంట కొనుగోలుకు కూడా ఈ పంట నమోదు తప్పనిసరి అని తెలిపారు. పంట నమోదుకు రైతులు ఆధార్‌ జిరాక్స్‌, పట్టాదార్‌ పాస్‌ బుక్‌ జిరాక్స్‌ తీసుకుని రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి శివప్రసాద్‌, గ్రామ సర్పంచ్‌ గాజుల నాగరాజు, చిలకలపూడి పీఏసీఎస్‌ అధ్యక్షులు బోయిన నాగబాబు రైతులు పాల్గొన్నారు వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ పాల్గొన్నారు.