కడప అర్బన్ పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న అనుమాన్పాద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆయనది హత్యగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌పి అన్బురాజన్ సోమవార పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్సు హాలులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 12న పశుసంవర్ధక శాఖలో పనిచేసే అసిస్టెంట్ సర్జన్ సుభాష్‌చంద్రబోస్, కలసపాడుకు చెందిన బావలూరి చెన్నకృష్ణ, గుర్రంకొండకు చెందిన మూడే బాలాజీ నాయక్ డిడి అచ్చెన్నను బలవ ంతంగా వాహనంలోకి ఎక్కించి రాయచోటికి తీసుకెళ్లారని ఎస్‌పి చెప్పారు. అక్కడ వారు మృతు డికి మద్యం తాగించి అదే రోజు మధ్యాహ్నం గువ్వల చెవురు ఘాట్‌కు చేరుకున్నారని తెలి పారు. ఆ సమయంలో అచ్చెన్న మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. నింది తులు మృతుడి ఛాతిపై బలంగా తన్నడంతో లోయలో పడిపోయారని వెల్లడించారు. దీంతో ఆయన్ను అక్కడే వదిలి వెళ్లిపోయారని పేర్కొ న్నారు. నిందితులు సాక్షాధారాలను రూపు మా పేందుకు మృతుడి మొబైల్‌ను తీసుకుని ఫోన్ ఒక చోట, సిమ్ కార్డు మరో చోట పారవేశారని తెలి పారు. ఇదీలా ఉండగా మృతుడి కుమారుడు డాక్టర్ క్లింటన్ చక్రవర్తి ఈనెల 14న తన తండ్రి కన్పించడం లేదని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈనెల 24న గువ్వల చెరువు ఘాట్‌లో అచ్చెన్న అనుమానాస్ప స్థితిలో మృతిచెంది పడినట్లు తెలిపారు. రామా పురం పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపట్టారని, అదేశాఖలో పని చేస్తున్న సుభాష్ చంద్రబోస్‌పై అను మానం రావడంతో అతన్ని విచారి ంచారన్నారు. ఈనెల 26న సాయంత్రం ముగ్గురు నిందితులు కడప విఆర్‌ఒ ఎదుట లొంగిపోయి తమ నేరాన్ని అంగీక రించారని తెలిపారు. వీరిని విఆర్‌ఒ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించగా జ్యూ డీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరు పరిచా రన్నారు. పశుసంవర్ధకశాఖలో విధుల్లో ఉన్న డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్ర మనస్పర్థలున్నాయని తెలి పారు. ఇదే హత్య కు ప్రధాన కారణమైందని స్పష్టం చేశారు. సమా వేశంలో కడప డిఎస్‌పి వెంకట శివారెడ్డి, దిశా పోలీస్ స్టేషన్ ఎస్‌పి వాసుదేవన్ పాల్గొన్నారు.
సిట్టింగ్ జడ్జిచే విచారించాలి : మందకృష్ణ మాదిగ
డిడి అచ్చెన్న హత్య కేసును సిట్టింగ్ జడ్జిచేత విచారించాలని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడి యాతో మాట్లాడారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు చేసినా 12 రోజుల పాటు పోలీసులు స్పందించలేదన్నారు. మృతదేహానికి కర్నూలు వైద్య నిపుణులతో పోర్టుమార్టం నిర్వహిం చాలన్నారు. ఈనెల 12న అచ్చెన్న అదృశ్యమైతే 14న ఆయన్ను ఎలా సస్పెండ్ చేశారని ప్రశ్నిం చారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన పేర్లలో ఒకరి పేరు తొలగించాలని కడప వన్‌టౌన్ సిఐ నాగరాజు బెదిరించారని తెలి పారు. సిఎం జగన్ సొంత జిల్లాలో దళిత ఉన్నతాధికారి ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.










