లండన్ : బ్రిటన్ ప్రధాని మరోసారి బోరిస్ జాన్సన్ మరోసారి హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. బోరిస్‌తో పాటు ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ కరోనా బారిన పడటంతో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన కారణంగా వీరు ఈ నిర్ణయం తీసుకున్నాని బ్రిటన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే సాజిద్ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం. బ్రిటన్ జాతీయ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) నిబంధనల ప్రకారం పాజిటివ్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు పది రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఆర్‌టి పిసిఆర్ నివేదిక నెగటివ్ వచ్చిన తర్వాత విధులకు హాజరు కావాలి. గత నెల 26న ఆరోగ్య శాఖ మంత్రిగా సాజిద్ బాధ్యతలు చేపట్టారు. గత ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హ్యాన్‌కాక్ రాజీనామా చేయడంతో ఆయనకు ఈ పదవి వరించింది. గత ఏడాది బోరిస్ జాన్సన్ కరోనా బారిన పడిన సంగతి విదితమే.










