బ్రహ్మరథోత్సవానికి హాజరైన జనం
లేపాక్షి : మండల కేంద్రంలోని దుర్గా వీరభద్ర పాపానసేశ్వర ఆలయం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రహ్మ రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వచ్చందంగా అన్నదాన కార్యక్రమం, మజ్జిగ, నీరు అందించారు. ఈ కార్యక్రమం లో అర్చకులు శీనస్వామి, నరసింహ శర్మ, సునీల్ శర్మ, వైసిపి మండల కన్వీనర్ నారాయణ స్వామి, మాజీ ఎంపీపీ ఆనంద్ కుమార్, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.










