Feb 13,2023 21:40

రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి - చిలమత్తూరు : గ్రామ సచివాలయాలలో సర్వీసులను పెంచి తద్వారా ప్రజలకు సేవలందించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు చిలమత్తూరు మండలంలోని టేకులోడు, దేమకేతేపల్లి పంచాయతీలలోని గ్రామ సచివాలయాలను ఆయన సోమారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సచివాలయాలను పరిశీలించిన ఆయన రికార్డుల నిర్వహణ, ఉద్యోగుల గౌర్హాజరు, ఎక్కువ రోజులు సెలువులు తీసుకోవడం వంటి వాటిని గమనించి ౖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది ఈ సర్వీసెస్‌,ఈ శ్రమ్‌,ఆయుష్మాన్‌ భారత్‌, రిజిస్ట్రేషన్‌పై ఆరా తీశారు. ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ భవన నిర్మాణాలను త్వరితగితన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది పనితీరును మెరుగు పరుచుకోవాలని సచివాలయాలను మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణ చేస్తూ గాడిలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రాంకుమార్‌,కార్యదర్శి నాగరాజు, డాక్టర్‌ రామకృష్ణ, మండల స్థాయిలోని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.