Feb 13,2023 19:50

మాట్లాడుతున్న రైతు సంఘాల నాయకులు

మాట్లాడుతున్న రైతు సంఘాల నాయకులు
ఆర్‌బి కేంద్రాల్లో
గోతాలు అందుబాటులోకి తేవాలి
కోవూరు:ఆర్‌బి కేంద్రాల్లో గోతాలు అందుబాటులోకి తేవాలని ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.సోమవారం స్థానిక సీతాపొలయ్య భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రైతులకు వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రభుత్వం ఆర్‌బికె కేంద్రాలు ఏర్పాటు చేసిన గోతాలు అందుబాటులోకి తెచ్చి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆర్బికే కేంద్రాలు అధికారుల సిఫారసు మేరకే మిల్లర్లు దించుకోవాలని, ఆ విధంగా ఆదేశాలు ఉండాలని కోరారు. ధాన్యం నాణ్యత పేరుతో జరిగే దోపిడీని ఆరికట్టాలన్నారు. గతంలో వరి కోతల సమయంలో రైతులే రవాణా ఛార్జీలను ఖర్చులు భరించినా ఇప్పటివరకు రైతులకు ఇవ్వలేదన్నారు.
ఎప్పటి లోపల విడుదల చేస్తారో ప్రభుత్వ చెప్పాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతులు ధాన్యానికి నగదు తోటే వారి అకౌంట్‌ లో రవాణా నగదు జమ చేయాలని డిమాండ్‌ చేశారు.సమావేశంలో రైతు సంఘం మండల నాయకులు ఎస్‌కె బాబు, గండవరపు బుజ్జయ్య, వవ్వేటి మల్లికార్జునరెడ్డి, కృష్ణయ్య, సురేష్‌, వెంకటేశ్వర్లు, మురళి, సుబ్బారావు, శ్రీనివాసులు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.