మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకు చేపడుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించిచాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.ఆదివారం నగరంలోని ఆత్మకూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి త నివాసంలో గహ నిర్మాణశాఖ డిఇ, ఏఈలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులనుద్ధేశించి మాట్లాడారు. ఇప్పటి వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో గహ నిర్మాణాల పురోగతికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.










