Feb 17,2023 22:00

ఫొటో : విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

గడ్డంవారిపల్లి విద్యార్థులకు అభినందనలు
ప్రజాశక్తి-ఉదయగిరి : గడ్డంవారిపల్లి విద్యార్థులు ఖోఖో పోటీలో ద్వితీయ స్థానం సాధించడంపై ప్రధాన ఉపాధ్యాయులు శీనయ్య ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని గడ్డంవారిపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థులను పిఇటి ఉపాధ్యాయులు వెంకటేశులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజమూరులో జరిగిన 98వ గ్రిగ్స్‌ పోటీలలో ఖోఖో పోటీలో విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించడం అందుకు సహరించిన పిఇటి ఉపాధ్యాయులను అభినందించారన్నారు.
ప్రతి విద్యార్థి క్రీడలను ఆడటంతో పాఠశాలతో పాటు గ్రామం కూడా మంచిపేరు వస్తుందని ప్రతి విద్యార్థి క్రీడల్లో ముందుండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.