Jul 27,2023 10:21

వరంగల్ : వరంగల్ జిల్లా మోరంచపల్లి గ్రామంలో కుండపోత వర్షం కురిసింది. వాగులు, వంకలు కట్టలు తెచ్చుకున్నాయి. ఈ కారణంగా ఆ గ్రామాన్ని వాగు ప్రవాహం చుట్టుముట్టింది. 6 ఫీట్ల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది. నిద్ర నుండి లేచి చూసే సరికి ఎక్కడకు కదిలే పరిస్థితి లేకుండా అయిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వరదల్లో ఐదుగురు గల్లంతు అయినట్లు సమాచారం. ప్రాణాలను కాపాడుకునేందుకు దాదాపు 200 కుటుంబాలు మిద్దెలపైకి ఎక్కి జనం తలదాచుకుంటున్నారు. కొందరు చెట్లు ఎక్కారు. హెలికాప్టర్లు పంపించాలని అధికారులను విన్నవించుకున్నారు. తెలంగాణాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.