- 5 అడుగుల మేర తగ్గిన వరద నీరు
- పునరావాస కేంద్రాలు ఎత్తివేత
ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : గత వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో నిండు కుండలా పోటెత్తిన గోదారమ్మ మంగళవారం ఉదయానికి శాంతించింది. కోటిపల్లి వద్ద గోదావరి ఐదు అడుగులు తగ్గడంతో ఇప్పటివరకు నీట మునిగి ఉన్న ప్రయాణికుల రేవు స్నాన ఘట్టాలు బయటపడ్డాయి. అయితే వరద ఉధృతి తగ్గినప్పటికీ... ఇంకా నీటి ప్రవాహం కొనసాగడంతో రేవు ప్రయాణాలు నిలిపివేత కొనసాగుతుంది. కోటిపల్లి వద్ద మత్స్యకారులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఈరోజు నుండి నిలిపివేశారు, గోదారమ్మ శాంతించడంతో ఏటిగట్టు పరీవాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు వరదలో మునిగిన లంకల్లో పంటలు ఏ మేరకు నష్టం వాటిల్లింది అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఐలాండ్ గ్రామం శేరిలంక లోనూ మంగళవారం మండల అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు.










