Apr 13,2023 07:35
  • ప్రభుత్వ ఆదేశం అమలు - కమిషన్‌ ముందు డిస్కాంల భిన్న వైఖరి

విశాఖపట్నంలోని హిందూజా ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు (1040 మె.వా.) వివాదాస్పద అదనపు చెల్లింపుల వ్యవహారంలో విద్యుత్‌ పంపి ణీ కంపెనీలు (డిస్కాంలు) కమిషన్‌ ఉత్తర్వును ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఒక పక్క అదనపు చెల్లింపులను ప్రారంభించా యి. హిందూజా ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం, చార్జీలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై గతేడాది ఆగస్టు మొదటి తేదీన ఆంధ్రప్రదేశ్‌ విదు ్యత్‌ నియంత్రణ కమిషన్‌ (ఎపిఇఆర్సి) ఇచ్చిన ఉత్తర్వులోని అంశాలను ప్రశ్నిస్తూ, వాటిని మార్చాలని కోరుతూ హిందూజా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై దాఖలు చేసిన కౌంటర్లో రెండు డిస్కాంలు ఇపిడిసిఎల్‌, ఎస్‌ పిడిసిఎల్‌ ప్రభుత్వ ఆదేశానికి భిన్నంగా కమిషన్‌ ఉత్తర్వు ను సమర్ధించాయి. బుధవారం నాడు రివ్యూ పిటిషన్‌ కమిషన్‌ ముందుకు విచారణకు వచ్చినపుడు, వాదనలు చేసేందుకు హిందూజా తర పున సమయం కోరగా, వచ్చే నెల 3వ తేదీకి విచారణను కమిషన్‌ వాయిదా వేసింది. హిందూజా రివ్యూ పిటిషన్ను వాదిప్రతివాదుల మ ధ్య వివాదంగా తొలుత విచారణకు చేపట్టిన కమిషన్‌, ఈసారి దానిపై ఆసక్తి గలవారి నుండి అభ్యంతరాలను, సూచనలను ఆహ్వానించి, బహిరంగ విచారణ జరుపుతామని తనంతతాను ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుండి ప్రభుత్వ గ్యారంటీతో రూ. 1234.68 కోట్ల మేరకు రుణాన్ని పొందుతూ, డిస్కాంలు అందులో సగం మొత్తాన్ని ఇప్పటికే హిందూజాకు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం చెల్లించటానికి అంగీకరిం చిన మొత్తానికి రెట్టింపు మొత్తాన్ని అదనంగా క్లెయిము చేసిన హిందూజా, తన మొత్తం క్లెయిమును విడనాడటం లేదనే షరతుతో మొద టి విడత మొత్తాన్ని తీసుకున్నట్లు సమాచారం.
హిందూజా రివ్యూ పిటిషన్లో లేవనెత్తిన ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తూ, కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వును పూర్తిగా సమర్ధిస్తూ డిస్కాంలు తమ కౌం టర్ను దాఖలు చేశాయి. హిందూజా రివ్యూ పిటిషన్ను తిరస్కరించాలని కమిషన్ను కోరాయి. 2022 జులై 31కి ముందు కాలంలో హిం దూజా సరఫరా చేసిన, చేయని విద్యుత్కు అదనపు స్థిర చార్జీల చెల్లింపుకు హిందూజా కమిషన్‌ ఉత్తర్వుకు వక్రభాష్యం చెప్పిందని డిస్కాం లు కౌంటర్లో వాదించాయి. గతేడాది జులై 30వ తేదీకి ముందు కాలానికి ఎపిఈఆర్సి తాత్కాలిక చార్జీ తుది అని గత ఆగస్టు మొదటి తేదీన ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొన్న కారణాలతో సక్రమంగా నిర్ణయించిందని డిస్కాములు పేర్కొన్నాయి. డిస్కాంలు కమిషన్‌ ముందు తీసు కున్న వైఖరిలో పలు అంశాలు ఇమిడి ఉన్నాయి. పైన పేర్కొన్న కాలానికి హిందూజాకు అదనపు చెల్లింపులు చేయాలన్న ప్రభుత్వ ఆదేశం కమిషన్‌ ఉత్తర్వును ఉల్లంఘించటమేననేది ఒకటి. ఇద్దరు న్యాయనిపుణులు హిందూజాకు అదనపు చెల్లింపులపై ఇచ్చిన అభిప్రాయాలు చట్ట సమ్మతం, న్యాయం సమ్మతం కావనేది మరో అంశం. కమిషన్‌ ఉత్తర్వు డిస్కాంల, వినియోగదారుల ప్రయోజనాన్ని కాపాడేది, సము చితమైనది కాగా, ప్రభుత్వ నిర్ణయం డిస్కాంల, ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీసేదనేది మరో అంశం.
రివ్యూ పిటిషన్కు కారణాలుగా ఉండాల్సిన ప్రధానాంశాలు హిందూజా పిటిషన్లో కొరవడ్డాయని డిస్కాంలు పేర్కొన్నాయి. తగు పరిశీలన జరిపినప్పటికి గత విచారణ సమయంలో సమర్పించని కొత్త వాస్తవాలను కనుగొనటం ఒకటి. రికార్డులో ప్రస్ఫుటంగా ఏదైనా పొరపాట ఎ కనిపించటం రెండవది. ఏదైనా తగినంత ఇతర కారణం మూడవది. హిందూజా రివ్యూ పిటిషన్లో ఈ మూడు అంశాలు లేవని, అంద ఎవల్ల ఆ పిటిషను కొట్టివేయాలని కమిషన్ను కోరాయి. డిస్కాంల తరపున సీనియర్‌ న్యాయవాది పి. శివరావు విచారణకు హాజరయ్యారు.
రివ్యూ పిటిషన్పై కమిషన్‌ బహిరంగ విచారణ జరిపి, ఉత్తర్వు ఇచ్చేనాటికి ప్రభుత్వ ఆదేశం మేరకు డిస్కాంలు మిగిలిన మొత్తాన్ని కూడా హిందూజాకు చెల్లించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో, రివ్యూ పిటిషన్పై కమిషన్‌ ఇవ్వనున్న ఉత్తర్వు ప్రజా ప్రయోజనాన్ని ఎలా కాపాడగలుగుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఇంధనం, విద్యుత్‌ కొనుగోలు వ్యయం సర్దుబాటు (ఎఫ్‌ పిపిసిఎ) కింద హిందూజాకు చెల్లించిన మొత్తాలను ట్రూ అప్‌ క్లెయిము చేస్తే, అది తన ఉత్తర్వుకు విరుద్ధంగా ఉంటే ఆ క్లెయిమును తిరస్కరిస్తా మని 2023-24 సంవత్సరానికి ఇచ్చిన చార్జీల ఉత్తర్వులో కమిషన్‌ వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం జరిగితే, ఆ మొత్తాలను డిస్కాంల 3 నష్టాలుగా భరించాల్సి వస్తుంది. ఆ మొత్తాలను హిందూజా నుండి తిరిగి రాబట్టాలని కమిషన్‌ ఆదేశిస్తే, అది తదుపరి వివాదాలకు దా రి తీస్తుంది. న్యాయం ఆలస్యమైతే న్యాయం జరగనట్లే అనే నానుడి వాస్తవికమైనది.
ఎవరైనా కార్డు రాసినా, పత్రికలలో, ఇతర మాధ్యమాలలో వార్తగా వచ్చినా సంబంధిత అంశాన్ని సుప్రీం కోర్టుతో సహా న్యాయస్థానాలు తమంత తాము విచారణను చేపడుతున్న ఉదంతాలు ఉంటున్నాయి. కమిషన్‌ ఉత్తర్వును ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిస్కాంలతో అదనపు చెల్లింపులు చేయించేందుకు తీసుకొంటున్న చర్యలను ఉన్న సమాచారం మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిస్కాంల వార్షిక ఆదాయ అవసరాలు, చార్జీల సవరణ ప్రతిపాదనలపై కమిషన్‌ నిర్వహించిన బహిరంగ విచారణలో లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కూడా కమిష న్‌ దష్టికి తెచ్చాము. ఈ చెల్లింపులు జరపకుండా డిస్కాములను ఆదేశించాలని కోరాము.
కమిషన్కు సివిల్‌ కోర్టుకు ఉన్న అధికారాలు చట్టరీత్యా ఉన్నాయి. సంబంధిత వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సమర్పించాలని తనంతతాను ఆదేశించే అధికారం కమిషన్కు ఉ ంది. దానిపై విచారణ జరిపించే అధికారం కూడా కమిషన్కు ఉంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అధికారం కూడా ఉంది. ఇలాంటి వ్య వహారాలలో కమిషన్‌ తన అధికారాలను సకాలంలో, సముచితంగా వినియోగిస్తే, విశాల ప్రజా ప్రయోజనాన్ని పరిరక్షించే అవకాశం ఉంది.

- ఎం.వేణుగోపాలరావు