Jan 13,2021 21:41

మాట్లాడుతున్న సమితి వ్యవస్థాపకులు ఎస్‌.మల్లి.

మాట్లాడుతున్న సమితి వ్యవస్థాపకులు ఎస్‌.మల్లి.

ఎస్‌.సి.,ఎస్‌.టి.కార్పొరేషన్ల నిధులు
'అమ్మఒడి'కి బదలాయించడం తగదు
-దళితసంఘర్షణసమితి-
ఫోట్ణో 13కెవిఎల్‌01్ణ మాట్లాడుతున్న సమితి వ్యవస్థాపకులు ఎస్‌.మల్లి.
ప్రజాశక్తి - కావలి:రాష్ట్రంలోని వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ''అమ్మఒడి''పథకానికి గతేడాది ఎస్‌.సి. కార్పొరేషన్‌ నుంచి రూ.1276 కోట్లు, ఎస్‌.టి.కార్పొరేషన్‌ నుంచి రూ.670కోట్లు, ఇతర కార్పొరేషన్ల నుంచి పేద, దళిత, గిరిజన కుటుంబాల కోసం ఖర్చుపెట్టాల్సిన డబ్బును 'అమ్మఒడి''పథకానికి కేటాయించి, పక్కదారిపట్టింవచడం తగదని దళిత సంఘర్షణసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్‌.మల్లి తప్పుపట్టారు. బుధవారం స్థానిక 'జర్నలిస్టుక్లబ్‌'లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈసంవత్సరం అదే రేషియోలో 'అమ్మఒడి'కి కటాయించి,బడ్జెట్‌లో నుంచి రావాల్సిన ఎస్‌.సి., ఎస్‌.టి, సబ్‌ప్లాన ్‌నిధులు అమ్మఒడికి కేటాయించడం,అందులో 'అమ్మఒడి'కి కార్పొరేట్‌ కళాశాలలకు ఇచ్చి, దళితులనోట్లో మట్టికొట్టారని విమర్శించారు.
ఇంత దుర్మార్గంగా ఎస్‌.సి., ఎస్‌.టి.,ల నిధులను లెక్కలేకుండా ఇతరులకు, ఇతర పథకాలకు బదలాయించి, దళితులకు నిధులు అందకుండాచేయడం సబబుకాదన్నారు. ఇకనైనా పక్కదారిపడుతున్న ఎస్‌.సి., ఎస్‌.టి., గిరిజనుల నిధులను వారికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో దళిత నాయకులు అంచిపారరత్నం, జరుగుమల్లి విజయరత్నం, ఎం.వెంకయ్య పాల్గొన్నారు.