ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగనన్న అమ్మఒడి పథకం నాలుగో ఏడాది నిధులు ఈ నెల 28న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో బుధవారం పర్యటించనున్నారు. చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల సభ జరగనుంది. ఈ సభలో బటన్ నొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేయనున్నారు. ప్రస్తుతం అమ్మబడి అర్హుల జాబితా గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకుంది. ఈ జాబితాను సచివాలయ అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు. విద్యార్థి హాజరు 75 శాతం ఉంటేనే అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు ఇతర సంక్షేమ పథకాలకు వర్తించే నిబంధనలే ఈ పథకానికి వర్తిస్తాయి.










