ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ప్రజ్ఞా వికాస్ 10వ తరగతి మోడల్ పరీక్షలలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు పాఠశాలలలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 300మంది విద్యార్థులు హాజరైనట్లు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ 2019లో జాతీయ విద్యా విధానం ఫీజుల పెంపు, ఐఐటీలో ఐఐటీలలో రిజర్వుడ్ విద్యార్థుల తక్కువ ప్రాతినిధ్యంపై నిరసన వ్యక్తం చేసింది. భారతదేశంలో ప్రయివేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించడం కోసం ఎస్‌ఎఫ్‌ఐ కోర్టు కేసులను అలా విద్యార్థుల కోసం అనేక పోరాటాలు చేసి వారి హక్కులను సాధించినట్లు తెలిపారు. నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఖాదర్, మణీ, హరి, దావూద్, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.










