Sep 16,2023 22:03

ఫొటో : మాట్లాడుతున్న నాయకులు

'ఎస్‌డబ్ల్యుఎఫ్‌'తోనే సమస్యల పరిష్కారం
ప్రజాశక్తి-ఉదయగిరి : కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేందుకు ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ముందుందని నాయకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్‌టిసి డిపో ఎదుట ఎస్‌డబ్ల్యుఎఫ్‌ 45వ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప.. మనమందరం ఐక్యమత్యంగా నిలబడి కలిసి పోరాటాలతోనే మన హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలన్నారు. అన్ని యూనియన్లు కలుపుకుపోయి సమస్యను పరిష్కరించుకునే అందుకే ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ముందుందన్నారు. ప్రతి కార్మికులు ఐక్యత మన సమస్యలకు పరిష్కారమని అందుకు ప్రతి యూనియన్‌ నాయకులు ఐక్యం తథ్యమన్నారు.
అనంతరం కార్మికులకు స్వీట్లు పంచిపెటారు. కార్యక్రమంలో రీజియన్‌ బాధ్యులు షేక్‌.యస్థాని బాషా, డిపో అధ్యక్ష కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, ఎస్‌.రవి, కోశాధికారి వి.రవిబాబు, కమిటీ సభ్యులు షేక్‌.నజీర్‌ అహ్మద్‌, కె.మధుసూధన్‌, పి.ఎమ్‌.బాబు టి.క్రిష్టయ్య, ఇ.తిరుపతయ్య, ఇ.సురేష్‌ కుమార్‌, విజే శేఖర్‌, ఎస్‌.కోటయ్య, ఎన్‌ఎంయుఎ సభ్యులు ఎమ్‌.వెంకటేశ్వర్లు, షేక్‌.సలామ్‌, సిసిఎస్‌ డెలిగేట్‌ ఫణికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.