Sep 16,2023 19:17

మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-కందుకూరు :స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ 45వ వ్యవస్థాపక దినోత్సవం కందుకూరులో కె ప్రవీణ్‌ అధ్యక్షతన శనివారం జరిగింది. డిపో కార్యదర్శి రమణయ్య జెండా ఆవిష్కరణ చేశారు. కార్మికులును ఉద్ధేశించి రమణయ్య మాట్లాడుతూ ఐక్య కార్యాచరణతో అన్నీ సంఘాలు కలిసి ముందుకు వెళ్ళాలని సూచించారు. సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి షేక్‌. గౌస్‌ బాషా మాట్లాడుతూ ఐక్యతా నినాదంతో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఆవిర్భవించిందన్నారు. సిఐటియు రూరల్‌ కార్యదర్శి జివిబి కుమార్‌ గతం లో జరిగిన ఐక్య పోరాటాలు గుర్తు చేశారు. కిరణ్‌ బాబు,మాలకొండయ్య, రబ్బానీ, వేమూరి వేంకటేశ్వర్లు, బ్రహ్మ నాయుడు , కోటేశ్వర రావు ఉన్నారు.