మాట్లాడుతున్న కమిషనర్ హరిత
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుచేయండి
నెల్లూరు:తూర్పు రాయలసీమ నియోజకవర్గ శాసనమండలి (ఎంఎల్‌సి) స్థానాలకు జరగనున్న ఎన్నికల దష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) పటిష్టంగా అమలు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ లోని కమిషనర్ కార్యాలయంలో నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఈనెల 16 వ తేదీన చిత్తూరు - నెల్లూరు - ప్రకాశం పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుందని, షెడ్యూల్ ప్రకారంగా మార్చి నెల 13 వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారని తెలిపారు. ఎన్నికల నియమావళి సూచించిన అన్ని అంశాలు నగర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు కషి చేయాలన్నారు. నగర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున స్పందన వేదికను తాత్కాలికంగా రద్దు చేశామని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ ఎస్.ఈ సంపత్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, టి.పి.ఓ ప్రసాద్ రావు, టౌన్ ప్లానింగ్ డి.సి.పి దశయ్య, తహశీల్దార్ నిర్మలానంద బాబా, ఎన్నికల విభాగం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.










