Sep 16,2023 19:20

ఎంఎల్‌ఎను కలిసిన గంగవరపు వెంకటరావు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు మండల వైసిపి అధ్యక్షులుగా విక్కిరాల పేట గ్రామానికి చెందిన గంగవరపు వెంకటరావు నియమితులయ్యారు. శనివారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఎంఎల్‌ఎ మాను గుంట మహీధర్‌ రెడ్డిని వెంకట్రావు, మండల వైసిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి మాట్లాడుతూ పదవి అనేది అలంకారం కాదని, బాధ్యత అన్నారు. అందరిని కలుపు కుని పార్టీ బలోపేతానికి కషి చేయాలని కోరారు. వెంకటరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందర్నీ కలుపుకొని సమన్వయంతో కషి చేస్తానన్నారు. తనకు మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి, ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డికి వెంకట రావు ధన్యవాదాలు తెలిపారు. సర్పంచులు కుమ్మర బ్రహ్మయ్య, ఆవుల మాధవరావు ,జెసిఎస్‌ మండల కన్వీనర్‌ చీమల వెంకట రాజా, జడ్పిటిసి ప్రతినిధి తొట్టెంపూడి శ్రీనివాసులు ,ఎంపీపీ ప్రతినిధి ఇంటూరి మాధవరావు, తోకల కొండయ్య, పెంచల రెడ,ి్డ అల్లం రాధయ్య, కొత్తపల్లి బ్రహ్మయ్య, మంగాపతి ఉన్నారు.