Jul 18,2022 22:54
  • సవరణ బిల్లు-2022ను సిద్ధం చేసిన కేంద్రం
  • సబ్సిడీలకు కోత.. రాష్ట్రాలను దెబ్బకొట్టడమే వ్యూహం!

న్యూఢిల్లీ: ఇప్పుడు మరో వివాదాస్పద బిల్లును మోడీ సర్కార్‌ తీసుకురాబోతోంది. విద్యుత్‌ సవరణ బిల్లు, 2022ను రాష్ట్రాల మీద రుద్దడానికి సర్వం సిద్ధం చేసింది. విద్యుత్‌ పంపిణీ ప్రయివేటీకరించటం ఈ బిల్లులో ప్రధానాంశం. క్షేత్రస్థాయిలో వినియోగదారులకు ప్రయివేటు డిస్కాంలు కనెక్షన్లు ఇస్తాయి. విద్యుత్తు అమ్ముతాయి. దీనిని రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యుత్‌ ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా కేంద్రం మాత్రం ఏకపక్షంగా ముందుకువెళ్తోంది. అందరితో చర్చించాం. వారు సూచించిన మార్పులు చేశాం.. అంటూ కేంద్రం తన చర్యల్ని సమర్ధించుకుంటోంది. పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
       విద్యుత్‌ సంస్కరణల పేరిట కేంద్రం చేస్తున్న చట్ట సవరణ అంతా ఏకపక్షమని, ఈ బిల్లుపై ఎవరితో మాట్లాడకున్నా. మాట్లాడామని అబద్ధాలు ప్రచారం చేస్తోందని లోకం కోడై కూస్తోంది. బిల్లులో అత్యంత ప్రమాదకర అంశాలున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లుతో మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని వారు చెబుతున్నారు. కేంద్ర విద్యుత్‌ శాఖ వెబ్‌సైట్లో ఇప్పటివరకూ ఆ బిల్లు సమాచారాన్ని పొందుపర్చలేదని భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలు తీసుకోలేదని నిపుణులు అన్నారు. విద్యుత్‌ చట్టాన్ని సవరించే ముందు రాష్ట్రాలతో, ఉద్యోగులు, వినియోగదారులతో చర్చించాలని, అదంతా కూడా బహిరంగపర్చాలని నిపుణులు డిమాండ్‌ చేశారు. ముసాయిదా బిల్లును పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సమీక్షకు పంపాలని సూచించారు. ఇంత హడావిడిగా విద్యుత్‌ సవరణ బిల్లును తీసుకురావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. విద్యుత్‌ రంగంపై వ్యాపారవేత్తలు, కార్పొరేట్ల కన్ను పడిందని, వారి కోసం మోడీ సర్కార్‌. ఆరాటపడుతోందని విమర్శించారు. బిల్లులోని అంశాలన్నీ బడా వ్యాపారులకు ఉద్దేశించినవే ఉన్నాయన్నారు. విద్యుత్‌ రంగం కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ బిల్లులో కేంద్రం అనేక క్లాజులు రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రాలపై ఆర్థికభారం పెరగనున్నది. ఇదంతా కూడా సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని కేరళ, తెలంగాణ, పంజాబ్‌ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వ్యతిరేకించాయి.

          వంటగ్యాస్‌ సిలిండర్‌ పై సబ్సిడీకి మోడీ సర్కార్‌ మంగళ పాడింది. అలాగే విద్యుత్‌ వినియోగదారులకు ఇప్పుడు ప్రభుత్వ డిస్కాంలు ఇస్తున్న సబ్సిడీలను కూడా తొలగించాల అన్నదే కేంద్రం ఎత్తుగడ ప్రయివేటు కంపెనీలు రంగ ప్రవేశం చేశాక, కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు సైతం దెబ్బతినే అవకాశముంది. విద్యుత్‌ మౌలిక వసతుల కల్పనకు ఆయా రాష్ట్రాలు రూ.లక్షల కోట్లు ఖర్చు చేశాయి. ఇదంతా కూడా ప్రజల డబ్బుతో ఏర్పాటైంది. మౌలిక వసతులు. - ప్రయివేటు కంపెనీలు వాడుకోవటమేంటి? మెల్ల మెల్లగా అదంతా కూడా ప్రయివేటు పరం కాదన్న నమ్మక మేంది? దేశమంతా ఉదాహరణకు జూన్‌ నెల విద్యుత్‌ బిల్లు చెల్లింపు గడువు, హెచ్చరిస్తున్నారు.

        వినియోగదారుడికి జులైలో 21 వరకు ఉంది. కొత్త చట్టం ప్రకారం.. ప్రీపెయిడ్‌ చేస్తేనే సరఫరా ఉంటుంది. కార్పొరేట్లు అమ్ముతున్న సోలార్‌ విద్యుత్‌ను రాష్ట్రాలు కచ్చితంగా కొనుగోలు చేయాల్సి వుంటుంది. రాష్ట్రాల్లో విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్స్‌ కనుమరుగవుతాయి.
(ముంబయి సబర్బన్‌ ప్రాంతంలో టాటా, అదానీ కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ లైసెన్సులు ఇచ్చారు. ప్రయివేటుకు అవకాశమిచ్చాం, నాణ్యమైన విద్యుత్‌ తక్కువ రేటుకు అందుబాటులోకి తీసుకొచ్చామని మొదట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక టారిఫ్‌తో కూడిన విద్యుత్‌ను టాటా, అదానీ కంపెనీలు వినియోగదారులకు అమ్ముతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో లాభపడింది బడా కార్పొరేట్లు, మోసపోయింది సామాన్య ప్రజలు. విద్యుత్‌ సవరణ బిల్లు-2022 చట్టరూపం దాల్చితే ఇదే జరుగుతుందని నిపుణులు అంటున్నారు.)