Aug 23,2022 12:40

ప్రజాశక్తి-నందిగామ : విద్యారంగ సమస్యలు పరిష్కారానికై ఈరోజు జరుగుతున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల  అక్రమ అరెస్ట్ చేసిన పోలీసులు నిర్బంధాన్ని అధిగమించి చందర్లపాడులో బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా చనుమోలు సైదులు, (ఎస్ఎఫ్ఐ) నందిగామ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్ మాట్లాడుతూ మంగళవారం  రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కె.జి. (నుండి) పి.జి వరకు విద్యాసంస్థలు బంద్ అక్క మరణం అధికమించి మంగళవారం చందర్లపాడులో బంద్ విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, జగనన్న విద్యకానుక విద్యార్థులుకు రాలేదని అన్నారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. మరియు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో సరైన వసతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మూడు నాలుగు ఐదు తరగతిలో విలీనం ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ పీజీ సెట్ రద్దు చేయాలని మరియు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. అర్హులైన పీజీ విద్యార్థులందరికీ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యాసంస్థల బంద్ తల్లిదండ్రులు విద్యాసంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న ఫీజులు బకాయిలు విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయొద్దని కోరారు
నాడు - నేడు పనులు వెంటనే పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న అధిక ఫీజులు దోపిడీ నివారించాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు ప్రభుత్వ విద్యాలయాల్లో జగనన్న గోరుముద్ద పథకంలో సన్న బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఎస్.కె హస్సాన్, ఎస్ఎఫ్ఐ నందిగామ అధ్యక్షులు పాటి రవి, నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.