Oct 12,2022 15:45

ప్రజాశక్తి-నందిగామ : పల్లగిరి గ్రామంలో ఎం‌.పీ.యు.పీ పాఠశాల నందు కళావేదిక డిజిటల్ క్లాస్ రూమ్ ను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన  రాచెమ్  ఫార్మా లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎమ్.ఎస్.ఎన్ .రెడ్డి  దంపతులను  ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సత్కరించారు. నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు రాచెమ్  ఫార్మా లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎన్ రెడ్డి  సహకారంతో నూతనంగా నిర్మించిన కళావేదిక మరియు డిజిటల్ క్లాస్ రూమ్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చి, పేద విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం మరియు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తితో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పలువురు దాతలు-పూర్వ విద్యార్థులు -స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే పల్లగిరి గ్రామంలో ఫార్మా లిమిటెడ్ ప్రెసిడెంట్ యం.యస్‌.యన్ రెడ్డి  దంపతులు ముందుకు వచ్చి విద్యార్థుల సౌకర్యార్థం కళావేదిక - డిజిటల్ క్లాస్ రూమ్ నిర్మాణాలకు సహకరించటం అభినందనీయమన్నారు . అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెస్ఎన్ రెడ్డి  దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవికిరణ్ రెడ్డి , జడ్పిటిసి గాదెల బాబు, నాయకులు బుచ్చిరెడ్డి , వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ వేల్పుల రాము తదితరులు పాల్గొన్నారు.