మాట్లాడుతున్న ఎంయల్‌ఎ మహీధర్ రెడ్డి
ప్రజాశక్తి -కందుకూరు :ప్రకతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను విక్రయించుకునేందుకు పట్టణంలోని చేపల మార్కెట్ పక్కన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గదులు కేటాయించాలని ఆలోచిస్తున్నట్లు ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ధరల స్థిరీకరణ పై సమావేశం జరిగింది.ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. దాన్ని దష్టిలో పెట్టుకొని ప్రోత్సహించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా మన్నారు. రైతులు ఆశించిన మేరకు పంటల దిగుబడి వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉందన్నారు. గిట్టుబాటు ధరలు రాబట్టుకోవడం కోసం ఈ మార్కెటింగ్ విధానం తెలుసుకోవాలని ఆయన తెలిపారు.










