ప్రజాశక్తి-నెల్లూరు :ఎఎస్.పేట దర్గాలో మహిళలపై జరుగుతున్న ఆకత్యాలను అరికట్టాలని, మహిళలపై వికృత చేష్టలకు పాల్పడుతన్న దర్గా పీఠాధిపతి హఫీజ్ పాషాను శిక్షించేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారం ఆ సంఘం ఆద్వర్యంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి షేక్. మస్తాన్ బి మాట్లాడుతూ ఏ.ఏస్ పేటదర్గాకు 260 .ఏళ్ల చరిత్ర ఉందన్నారు. కుల,మతాలకు అతీతంగా లక్షాలాదిగా భక్తులు వస్తుం టారన్నారు. ప్రధానంగా హైదరాబాద్, కడప ,చెన్నై నుంచి మహిళా మానసిక రోగులు వస్తుంటారన్నారు. నెలల తరబడి వైద్యం పేరుతో రూములు అద్దెకు తీసుకుని ఉంటారన్నారు. వారి బలహీనతలను ఆసరా చేసుకుని దర్గా పీఠాధిపతి మహిళలపై ఆకత్యాలకు పాల్పడుతుండటం దుర్మార్గమన్నారు. నగర రూరల్ కార్యదర్శులు ,కె.పద్మ .షేక్. షాహీన బేగం. ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు షంషాద్.జాకీరా.సుధారాణి పాల్గొన్నారు










