Aug 17,2022 23:35

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: మండలంలోని తక్కెలపాడు గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వవిప్‌, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కెళ్ళపాడు గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తుమ్మల ప్రభాకర్‌, మండల పార్టీ అధ్యక్షులు చిలుకూరు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిల్లకల్లు మండల సమైక్య వారి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ క్రాంతి పదం (చేయత) కింద లబ్దిదారులకు పెరటి కోళ్లను ఉదయభాను పంపిణీ చేశారు.