Mar 25,2023 21:01

డిడి అచ్చన్న మృతిపై సమగ్ర విచారణ : డిఎస్‌పి

రామాపురం : కడప జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చిన్న అచ్చన్న మృతిపై సమగ్ర విచారణ చేపడతామని రాయచోటి డిఎస్‌పి శ్రీధర్‌ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక రామాపురం పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు అదృశ్యమై శవమైన కనిపించిన అచ్చనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామన్నారు. కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిలోని రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులోని కోనేటి బండల సమీపంలో శుక్రవారంచిన్న అచ్చన్న శవమై కనిపించినట్లు ఆ గ్రామం విఆర్‌ఒ కల్లూరు ఫాతిమాబి ఫిర్యాదు చేశారని తెలిపారు. తమ సిబ్బంది అక్కడికి వెళ్లారని ఆయన మృతికి సంబంధించిన ఆనవాళ్లు, మృతుని వద్ద ఉన్న ఆనవాళ్ల మేరకు కుటుంబీకులకు సమాచారం అందించమని పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లె సిఐ వరప్రసాద్‌, రామాపురం ఎస్‌ఐ కొండారెడ్డి. సంఘటన స్థలాన్ని చేరుకొని మృతిని శవ పంచనామ కోసం డాక్టర్‌ను సంఘటన స్థలానికి పిలిపించి శవ పంచనామా జరిపించమన్నారు. అచ్చన్న మృతదేహాన్ని ఆయన కుటుంబీకులకు శుక్రవారం రాత్రి పొద్దుపోయాక అందజేశామన్నారు. పశు సమర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ చిన్న అచ్చన్న విధులు నిర్వహిస్తున్న సమయంలో సస్పెన్షన్‌కు గురైనట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆ నోటీసులు తీసుకున్నందుకు మనస్థాపానికి గురయ్యారని సమాచారం ఉందన్నారు. కుటుంబీకులు, ఆ శాఖ అధికారులను సమగ్రంగా విచారిస్తే తనంతకు తానే చనిపోయాడా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయంపై సమగ్రంగా విచారణ చేస్తామన్నారు.
- మాట్లాడుతున్న డిఎస్‌పి శ్రీధర్‌