Jun 26,2022 10:21

న్యూఢిల్లీ : దేశంలో తాజా కరోనా కేసు సంఖ్య తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 4,53,940 మందికి కరోనా పరీక్షలు చేపట్టగా.. 11,739 కొత్త కేసులు వెలుగుచూశాయి. 25 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 10,917 మంది కోవిడ్‌ను జయించి ఇంటికి చేరుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.58 శాతానికి చేరింది. దేశంలో క్రియాశీల కేసులు 92,576కు పెరిగాయి. ఆ రేటు 0.21 శాతంగా ఉంది. దీంతో దేశంలో ఇప్పటి వరకు కోవిడ్‌ బారిన సంఖ్య 4.33 కోట్లు దాటగా.. 5,24,999 మంది మరణించారు. 4.27 కోట్ల మంది కరోనాను జయించారు. మొత్తంగా 197.08 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు వినియోగం అయ్యాయి.