May 08,2023 21:20

న్యూఢిల్లీ: ట్రిపుల్‌ జంపర్‌ ప్రవీణ్‌ చిత్రవేల్‌ జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2023 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ అర్హత ప్రమాణాలను కూడా అందుకున్నాడు. క్యూబాలోని హవానాలో జరుగుతున్న ఈవెంట్లో ప్రవీణ్‌ 17.37మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెంజిత్‌ మహేశ్వరి పేరిట ఉన్న జాతీయ రికార్డు(17.30మీ, 2016)ను అతడు తుడిచిపెట్టాడు. ఇదే ఈవెంట్లో 16.58మీ ప్రదర్శనతో సెల్వ బాబు నాలుగో స్థానం సాధించాడు. అతడు అండర్‌-20 జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. లాస్‌ ఏంజిలెస్‌లో జరిగిన ట్రాక్‌ ఫెస్టివల్‌లో అవినాష్‌ సబ్లే పురుషుల 5000మీ స్టీపుల్‌ చేజ్‌లో జాతీయ రికార్డు (13:19.30) నెలకొల్పాడు. రేసులో అతడు 12వ స్థానం సాధించాడు. మహిళల స్టీపుల్‌ చేజ్‌లో పారుల్‌ చౌదరి (15:10:35) జాతీయ రికార్డు నెలకొల్పింది. ఈ రేసులో ఆమె 9వ స్థానం నిలిచింది.