ప్రజాశక్తి-నెల్లూరు :టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ సిఎం నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయంలో ముస్లిం మైనార్టీ మత పెద్దలు, నాయకులు సంయుక్తంగా పోస్టు కార్డులతో నిరసన దీక్షలు చేపట్టారు. ఆదివారం రూరల్ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో పోస్టుకార్డులతో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిల మాట్లాడారు. అధికార పక్షం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ తమ నాయకుడు నారా చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలా ప్రజాక్షేత్రంలోకి వస్తారన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వ చర్యలను, ప్రతిపక్ష నాయకులను ఏ తరహాలో వేధింపులకు గురి చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల్లో ఈ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు సాగుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపికి ఘోర పరాజయం తప్పదన్నారు. రాష్ట్ర కార్యదర్శిలు జెన్నీ రమణయ్య, దొడ్డపనేని రాజా నాయుడు, ఎం.ఎస్.ఎం.ఈ. స్టేట్ డైరెక్టర్ కరిముల్లా, కార్పొరేటర్లు బద్దెపూడి నరసింహ గిరి, చేజర్ల మహేష్, కో ఆప్షన్ జెడ్పిటిసి మెంబర్ అల్లాబక్షు, మండల కోఆప్షన్ మెంబర్ మొహిద్దిన్, షంషుద్దిన్, క్లస్టర్ ఇంచార్జిలు మన్నెం పెంచాల నాయుడు, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, అల్లాబక్షు, కనపర్తి గంగాధర్, నయమత్, ఆసిఫ్ భాష, హయత్ బాబా, మౌలానా అజీజ్, బాబు, సర్తాజ్, చిన్న మస్తాన్, అస్లాం, జిలాని, కరిముల్లా, చాన్ బాషా,ఖాదర్ బాషా, సత్తార్, ఇలియాజ్, అబ్దుల్, అఫ్జల్,హుస్సేన్ ఉన్నారు.










