Aug 29,2022 22:54

చల్లపల్లి : చల్లపల్లిలో ఇరిగేషన్‌ శాఖ ఏఈఈ పులిగడ్డ వెంకటేశ్వ రరావు ఇంట్లో చోరీ జరిగింది. వివరాల ప్రకారం తమ కుమా రుడిని చెన్నైలోని కళాశాలలో చేర్చేందుకు వెంకటేశ్వరరావు కుటుంబం శనివారం వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి గేటు తాళాలు వేసి ఉన్నా ఇంటి మెయిన్‌ డోర్‌ లాక్‌ ఊడగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో భద్రపరిచిన రూ.లక్ష నగదు, 200 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి అపహరణకు గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఎండీ మహబూబ్‌ బాషా, సీఐ రవికుమార్‌ ఇంటికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌, సీసీఎస్‌ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.