Sep 17,2023 19:43

మాట్లాడుతున్న కమిషనర్‌

ప్రజాశక్తి-నెల్లూరు : కేంద్ర గహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ లు సంయుక్తంగా ''చెత్త రహిత నగరం (గార్బేజ్‌ ఫ్రీ సిటీ)'' వైపు ప్రజలను ప్రేరేపించడానికి ప్రయత్నాలను ప్రారంభించాయని, స్వచ్ఛ నెల్లూరు సాకారానికి నగర ప్రజలంతా సహకరించాలని కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ పిలుపు నిచ్చారు. కమిషనర్‌ నేతత్వంలో ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ 2.0 సఫాయి సురక్ష సివిర్‌ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 7 గంటలకు స్థానిక బారాషాహీదు ప్రాంగణం పరిసరాల స్వచ్ఛతే లక్ష్యంగా ''వాటర్‌ ఫ్రంట్‌ ఏ బారా షహీద్‌ దర్గా'' కార్యక్రమాన్ని దర్గాలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కమిషనర్‌ నేతత్వంలో స్వర్ణాల చెరువు, బరాషాహీదు ప్రాంగణంలోని వ్యర్ధాలను తొలగించి స్వచ్ఛతను చాటారు. స్వచ్ఛత లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌, అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టర్‌ కొమ్మెర్ల తులసి, నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు, ఇండోర్‌/ఔట్‌ డోర్‌ సిబ్బంది, సచివాలయ సెక్రెటరీలు, ఫిట్టర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.