Oct 17,2023 12:44

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామివారికి సింహ వాహనసేవ నిర్వహించారు. సింహ వాహనంపై స్వామివారు తిరుమాడ వీధులలో విహరిస్తూ సందర్శకులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి తదితరలు పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు శ్రీవారికి ముత్యపు పందిరి వాహనసేవ నిర్వహించన్నుట్లు ఆలయ అధికారులు తెలిపారు.