రాయచోటి : అసైన్‌మెంట్ భూములు గుర్తింపు నివేదికలు పక్కాగా ఉండాలని సిఎం కార్యాలయ కార్యదర్శి ముత్యాలరాజు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం విజయవాడ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు స్థానిక రాయచోటి కలెక్టర్ కార్యాలయంలోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ గిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అవసరమైనచోట్ల ఎస్‌సి శ్మశాన వాట ికలకు భూమి గుర్తింపు ప్రక్రియ, అసైన్మెంట్ వ్యవ సాయ భూముల వివరాలు, చుక్కల భూములు వివరాలు, లంక ల్యాండ్స్ గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. అసైన్మెంట్ భూముల గుర్తింపులో నివేదికలను పక్కగా రూపొం దించాలని ఆ తర్వాత పబ్లికేషన్ జారీ చేయా లన్నారు. భూముల గుర్తింపు ప్రక్రియ, తుది జాబితా రూపకల్పనలో తేడా రాకుండా పక్కగా నివేదికలను రూపొందించాలన్నారు. అన్నిచోట్ల నిబంధనల ప్రకారం అసైన్మెంట్ కమిటీ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. లంకా ల్యాండ్స్ భూముల గుర్తింపుకు సంబంధించి ముగ్గురు సభ్యుల కమిటీ ఆమోదం తీసుకోవాలన్నారు. ఎస్సీ శ్మశాన వాటిక లకు సంబంధించి ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని, చుక్కల భూముల నివేదికలను కూడా నిబంధన మేరకు రూపొందించాలని సూచించారు. ఆయా అంశాలకు సంబంధించి జిల్లాలోని లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు.










