Aug 15,2022 23:05

పెనమలూరు : వైయస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురులోని సిపిఎం కార్యాలయంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా మనకి స్వతంత్రం వచ్చిందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని, దేశ ఔన్నత్యాన్ని కాపాడుకుందామని అన్నారు. రాజ్యాంగంలో ఉన్న విధానాలని ఈనాటి పాలకులు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలోని మతాల మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం ఒకటో శాఖ సెక్రెటరీ రెండవ శాఖ సెక్రెటరీ ఎం సత్యం ,మహిళా శాఖ సెక్రెటరీ షేక్‌ ఒలిమాబి , ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కాసిం పాల్గొన్నారు.