Apr 17,2023 22:44

ముంబయి: స్టార్‌ ఇండియాకు భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) రూ.78.90కోట్ల రుణమాఫీ చేసింది. 2018ా2023 మార్చి 31వరకు ఐదేళ్ల కాలానికి స్వదేశంలో జరిగే దేశవాళీ టోర్నీలకు సంబంధించి బిసిసిఐాస్టార్‌ మధ్య మీడియా ఒప్పందం ప్రకారం మొత్తం 103 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ బిసిసిఐ 102 మ్యాచ్‌లను మాత్రమే నిర్వహించగలిగింది. దీంతో ఒక్క మ్యాచ్‌ తగ్గింపుకు గాను స్టార్‌ మాఫీని కోరడంతో ఆ మ్యాచ్‌ ఫీజుకు సంబంధించి 78.90కోట్లను బిసిసిఐ మాఫీ చేసింది. 2018ా2023 మార్చి 31వరకు స్వదేశంలో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబంధించి స్టార్‌ 6,138.1కోట్లకు బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకుంది.