ప్రజాశక్తి కదిరి అర్బన్ : మార్చి నెలలో నిర్వహించే ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే సంబందిత అధికారులు, పాలకులతో గురువారం సమీక్ష నిర్వహిచారు. ఆలయ ఆవరణంలో పాలకమండలి చైర్మన్ గోపాలకృష్ణ, ఆలయ ఈవో గురు ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. పాలకవర్గం, అధికారులు కలసి పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.. ఆలయంలో మరుగుదొడ్ల మరమ్మతులు చేయించాలన్నారు. బ్రహ్మోత్సవాలకు అదనపు మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే శాశ్వత మరమ్మతు పనులు చేయించి కోనేరు రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. మాజీ శాసనసభ్యులు ఎమ్మెస్ పార్థసారథి మాట్లాడుతూ అందరి సహకారంతో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నడుపుతున్నామని ఈ ఏడాది కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దేవాదాయ ప్రధాన అర్చకులు పార్థసారధి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.










