- తొలి వన్డేలో 17పరుగుల తేడాతో గెలుపు
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి వన్డేలో ఆతిథ్య జట్టుకు ఝలక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో 546పరుగుల తేడాతో ఓడిన ఆఫ్ఘన్ జట్టు బుధవారం జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై 17 పరుగుల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 170పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘన్ జట్టు 21.4ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 83పరుగులు చేసిన అనంతరం వర్షం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో డక్-వర్త్-లూయిస్ పద్ధతిపై ఆఫ్ఘన్ జట్టు గెలిచింది. బంగ్లా జట్టులో హిండోరు(51), లింటన్ దాస్(26) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఫారూఖీకి మూడు, ముజీబ్, రషీద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్లు గుర్బాజ్(22), జడ్రాన్(41నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫారూఖీకి లభించగా.. మూడు వన్డేల సిరీస్‌లో ఆఫ్ఘన్ జట్టు 1-0 ఆధిక్యతలో ఉంది. రెండో వన్డే శనివారం(8న) జరగనుంది.










