కాంగ్రెస్‌ప్రజాశక్తి - రాయచోటి
భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపికి గడ్డు రోజులు తప్పవని రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పతనం ఖాయం అని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఎస్. అల్లాబకాష్ పేర్కొన్నారు. అదివారం ఆయన ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు దేశవ్యాపితంగా విశేష ఆదరణ లభించిందని చెప్పారు. దీన్ని బిజెపి శ్రేణులు ఓర్వలేక రాహుల్ గాంధీ మీద కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ సభ్యత్వన్ని రద్దుచేసి అనర్హతగా ప్రకటించడాన్ని దేశంలోని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండిస్తున్నట్లు తెలిపారు. చిన్నచిన్న కారణాలకే అనర్హత వేటు వేసుకుంటూ పోతే ఇప్పుడున్న పార్లమెంటు సభ్యుల్లో దాదాపు 90 శాతం మంది సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఏపీ సి సి మైనార్టీ ఉపాధ్యక్షుడు ఎస్‌ఎండి రఫిక్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖాదర్ ఖాన్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు చెన్నకష్ణ, జిల్లా ఎస్‌సి సెల్ అధ్యక్షులు మంజునాథ, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖదీర్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ధర్మారెడ్డి, రామాపురం బిసి మండలాధ్యక్షుడు రామదాసు, చిన్నమండెం మండల అధ్యక్షులు జాఫర్ , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఖాదర్ ఖాన్, తాలూకా మహిళా ప్రెసిడెంట్ రవణమ్మ, లక్కిరెడ్డిపల్లి మండల మహిళా ప్రెసిడెంట్ మహబూబ్ జాన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆలీద్‌బాష ,రామాపురం కిసాన్ సెల్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ నాయకులు










